విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ


విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

అది వారి మొదటి పెళ్లి రోజు. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ దంపతులు ఆ రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ సంతోషం నిమిషాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్‌-నూతన కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం నూతన ఆరు నెలల గర్భవతి. శుక్రవారం వారి మొదటి వివాహ వార్షికోత్సవం కావడంతో ఉదయం నుంచి ఇద్దరూ ఎంతో ఆనందంగా గడిపారు. సాయంత్రం నూతనను తన పుట్టింటి వద్ద దింపిన నవీన్, ఇంటికి తిరిగి వచ్చి కారు కోసం షెడ్డు పనులు చేయిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. షెడ్డు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో నవీన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొద్దిసేపటి క్రితం వరకు తమతో నవ్వుతూ గడిపిన నవీన్ ఇక లేడన్న వార్త విన్న భార్య నూతన, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు, జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో ఇలా అనంత లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మొహం చూపే భాగ్యం కూడా లేకుండా పోయిందని భార్య విలపిస్తున్న తీరు అక్కడి వారిని కదిలించివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTRని చూసి ఫ్యాన్ హంగామా.. CM CM అంటూ నినాదాలు

Stock Markets: 10 నెలల కనిష్టానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు

US, Israel-Iran War: దాడుల విషయంలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు..?

Petrol Prices: టెన్షన్ పడకండి..పెట్రోల్ రేట్లు పెంచం

US, Israel-Iran War: ఇరాన్ దెబ్బకు బహ్రెయిన్ లో విఫలమైన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *