వాస్తు శాస్త్రం అనేది ఇంటిపై ఇంటిలో ఉన్న వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి ఒక్కురూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని, లేకపోతే అది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అయితే కొందరి ఇంట్లో ఎప్పుడూ కలహాలే జరుగుతుంటాయి. అయితే ఇలా ఇంట్లో గొడవలు జరగకూడదు అంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైతే వాస్తు నియమాలను సరిగ్గా పాటిస్తారో వారు ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తారు, వాస్తు నియమాలు ఉల్లంఘించినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారని చెప్తుంటారు పండితులు. ముఖ్యంగా చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు జరగడం, ప్రతి విషయంలో సమస్యలు తలెత్తడం జరుగుతుదంట. అయితే ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించకపోవడం వలన ఇంట్లో తరచూ గొడవలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.
వంట గది వాస్తు పై చాలా ప్రభావం చూపుతుంది. అందువలన వంటగది విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. గ్యాస్ స్టవ్ ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండ నీటి ఫిల్టర్,నీటి కుండ వంటివ ఈశాన్య దిశలో ఉండటం వలన ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట. ఇవి ఏవైనాసరే తప్పుడు దిశలో ఉంటే ఇంట్లో కలహాలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం, బెడ్ రూమ్లో తల భాగం ఎప్పుడూ కూడా దక్షిణ దిశలోనే ఉండాంట. ఒక వేళ మీరు ఉత్తరం దిశ వైపు తల పెట్టి పడుకోవడం వలన మానిక ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్య భాగంలో ఎలాంటి వస్తువులు, బరువు పెట్టకూడంట. ఈ ప్రాంతంలో ఏ వస్తువులు పట్టినా ఇంట్లో గజిబిజి, ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే ప్రధాన ద్వారా చాలా నీటుగా ఉండాలంట. ఇంటికి ఎదురుగా ఎప్పుడూ కూడ బూట్లు, చెప్పులు ఉండకూదని చెబుతున్నారు పండితులు. నోట్ : నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.