
షీలానగర్‌లోని ఒక ఇంట్లో మహిళా యజమాని ఎప్పటిలాగే తన బెడ్ రూమ్‌లోని వాష్ రూమ్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాక, కమోడ్ వైపు చూడగానే ఆమె గుండె ఝల్లుమంది. కమోడ్ లోపల ఏదో నల్లటి ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. అది ఏంటని తదేకంగా చూసేలోపే.. ఒక్కసారిగా ఒక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది! ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ, తలుపు తీసుకుని బయటకు పరుగులు తీసింది. వెంటనే తేరుకుని వాష్ రూమ్ డోర్ లాక్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగరాజు, కమోడ్‌లో దాగి ఉన్న ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సాధారణంగా బయట ఉండే వాష్ రూమ్‌లలో పాములు రావడం చూస్తుంటాం. కానీ బెడ్ రూమ్ లోపల ఉన్న కమోడ్‌లోకి పాము రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెప్టిక్ ట్యాంక్ పైపుల ద్వారా ఎలుకలను వేటాడుతూ ఈ పాము లోపలికి వచ్చి ఉంటుందని స్నేక్ క్యాచర్ అభిప్రాయపడ్డారు. ఆ మహిళ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా ఆ కాలనాగు కాటుకు బలైపోయేది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని వీడియోల కోసం :