వామ్మో దెయ్యం.. ప్రభుత్వ హాస్టల్‌‌లో చేరాలంటేనే వణికిపోతున్న విద్యార్థులు.. ఎక్కడంటే..

వామ్మో దెయ్యం.. ప్రభుత్వ హాస్టల్‌‌లో చేరాలంటేనే వణికిపోతున్న విద్యార్థులు.. ఎక్కడంటే..


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో 2007లో ఎస్సీ బాలుర హాస్టల్ ని ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్ గ్రామానికి దూరంలో ఉంటుంది.. అయితే.. గతంలో హాస్టల్‌కి కొద్ది దూరంలోనే అంత్యక్రియాలు నిర్వహించేవారు. ఇటీవల హాస్టల్ సమీపంలో స్మశాన వాటికను కూడా నిర్మించారు. హాస్టల్ పహారీ గోడకు కేవలం 8’మీ టర్ల దూరంలోనే స్మశాన వాటిక ఉంది. అంతేకాకుండా కిటీలో తెరిస్తే నేరుగా స్మశాన వాటికే కనబడుతుంది. నిత్యం ఇక్కడ శవాలు కాలిపోతుండడం, రాత్రి శబ్ధాలు వినిపిస్తున్న పుకార్లు రావడంతో ఈ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో గత రెండేళ్లుగా హాస్టల్‌లోని విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. కొత్త విద్యార్థులు చేరాలన్నా ధైర్యం చేయట్లేదు.

అయితే దెయ్యాలు ఉన్నాయన్న ప్రచారం ఎక్కువ కావడంతో హాస్టల్‌లో ఉన్న 12 మంది విద్యార్థులు తమ సామాగ్రి ఇక్కడనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ హాస్టల్‌ విద్యార్థులు లేక నిర్మానుషంగా మారిపోయింది. అయితే దెయ్యాలున్నాయనే ప్రచారాన్ని తోసిపూస్తూ వార్డెన్ విద్యార్థులను చేర్పించేందుకు వారి, తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు.. తమ పిల్లలకు ఏమైనా జరుగుతే ఎవరూ బాధ్యత తీసుకుంటారని నిలదీస్తున్నారు.

వాస్తవంగా.. ఇక్కడ ఎవరై నా ఒంటరిగా వెళ్లాలంటే భయ పడాల్సిందే. ఈ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా కనబడడు. ఎటు చూసిన సమాదాలు కనబడతాయి. దీని తోడూ ఇక్కడ దెయ్యం ఉందనే ప్రచారంతో ఇక్కడ ఉండలేమని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పుడు విద్యార్థులు లేకుండా హాస్టల్ ఖాళీగానే ఉంది. కేవలం హాస్టల్ సిబ్బంది ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇది విద్యార్థులకు సౌకర్యంగా లేదని.. ఈ హాస్టల్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా రాడని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *