వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ

వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ


వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ

ఢిల్లీ నుంచి నైనిటాల్‌కు పర్యాటక యాత్రకు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవరే లైంగికంగా వేధించడంతో ప్రాణభయంతో కారు దిగి అడవిలోకి పారిపోయింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ చీకటిలోనే గడిపిన ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టించింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ నైనిటాల్ చూసేందుకు ఒక ప్రైవేట్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం మార్గమధ్యంలో ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలోకి రాగానే డ్రైవర్ కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు. అనంతరం ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. డ్రైవర్ ప్రవర్తనతో తీవ్రంగా భయపడిన ఆ మహిళ సమయస్ఫూర్తితో కారులో నుంచి బయటపడి సమీపంలోని అడవిలోకి పరుగులు తీసింది. రాత్రంతా ఎలాంటి సాయం లేకుండా చీకటి అడవిలోనే భయంతో గడిపింది. మరుసటి రోజు ఉదయం అటుగా వచ్చిన కొందరు స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించి, ఆమె ఫిర్యాదు ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ వాహనం సహా పరారీలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!

ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ

ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు

ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే

Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *