వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది

వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది


వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది

భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భార్యతో చేసిన వాట్సప్‌ చాట్‌ల వివరాలను సమర్పించాడు. అందులో కాపురాన్ని నాసిక్‌ నుంచి పుణెకు మార్చాలని ఆమె డిమాండ్‌ చేసిందని, అత్త, వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని తెలిపాడు. ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న నాసిక్‌ కోర్టు.. వాట్సప్ చాటింగ్‌ ద్వారా ఆమె భర్తపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నించిందని, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్ చేసిందని, అసభ్యకర భాషను ఉపయోగించిందని తెలిపింది. క్రూరత్వం కింద అతడు విడాకులకు అర్హుడని ఉత్తర్వు ఇచ్చింది. కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వకుండా ఫ్యామిలీ కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందనీ తెలిపింది. మహిళ పిటిషన్‌ ను విచారించిన బాంబే హైకోర్టు నాసిక్‌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ‘‘భర్త సమర్పించిన వాట్సప్ చాట్‌ సాక్ష్యాలను ఖండించేందుకుగానూ కుటుంబ న్యాయస్థానం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. కేవలం వాట్సప్ చాట్‌లపై ఆధారపడి, విడాకులను మంజూరు చేయలేం. ఎందుకంటే ప్రధాన సాక్ష్యాల ద్వారా నిరూపితం కాలేదు అని తెలిపింది. ఆ జంట విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వాట్సప్‌ చాట్‌ల ఆధారంగా చేసిన క్రూరత్వం ఆరోపణలు పరిగణనలోకి తీసుకుని విడాకులు మంజూరు చేయలేమని అంది. గతంలో ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ కేసులో భార్యకు తన వాదనలను వినిపించేందుకు కింది కోర్టు అవకాశం ఇవ్వలేదని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే

జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు

Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్

Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు

Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *