వాట్సాప్‌లో విడాకులు..! మొత్తం కుటుంబంపై కేసు నమోదు..

వాట్సాప్‌లో విడాకులు..! మొత్తం కుటుంబంపై కేసు నమోదు..


వాట్సాప్‌లో విడాకులు..! మొత్తం కుటుంబంపై కేసు నమోదు..

ఈ మధ్య కాలంలో టెక్నాలజీని ఈ విధంగా కూడా వాడతారని వాడిన తర్వాత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇద్దరు జీవితాలకు సంబంధించిన విషయాన్ని ఓ వ్యక్తి జస్ట్‌ ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌తో తేల్చేశాడు. తలాక్‌.. తలాక్‌.. తలాక్‌.. అంటూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఆ మెసేజ్‌ పెట్టిన వ్యక్తతో పాటు అతని మొత్తం కుటుంబంపై కేసు నమోదు చేశారు పోలీసులు.

వరకట్నం కోసం భార్యను వేధించిన తర్వాత, వాట్సాప్ ద్వారా చట్టవిరుద్ధంగా ట్రిపుల్ తలాక్‌ ఇచ్చిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బసేరా గ్రామంలో జరిగింది. తన భర్త హసన్, అత్తగారు రషీదా, ఇద్దరు బావమరిది సలీం, షకీర్ లపై అస్మా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) రవిశంకర్ తెలిపారు.

ఫిర్యాదు ప్రకారం.. అస్మా నవంబర్ 2017లో హసన్‌ను వివాహం చేసుకుంది. కట్నం కోసం తనను నిరంతరం వేధిస్తున్నారని, తరువాత తన తల్లిదండ్రులతో కలిసి నివసించడానికి వదిలేశారని ఆమె ఆరోపించింది. మార్చి 31, 2025న తన భర్త తనకు వాట్సాప్‌లో చట్టవిరుద్ధంగా ట్రిపుల్ తలాక్ అని వాయిస్‌ మెసేజ్‌ పంపినట్లు ఆమె పేర్కొంది. వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం, 2019 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ నిషేధించిన విషయం తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *