దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ యాప్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, అశ్వినీ వైష్ణవ్ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా తాను జోహోకు మారుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ బదులుగా జోహోతోనే తాజా కేబినెట్ ప్రజెంటేషన్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే తరహాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలకు వాడాలని సూచించారు. అయితే, ప్రస్తుతం అరట్టై యాప్‌లో కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. మెసేజ్‌లకు ఈ సదుపాయం లేకపోవడం, గోప్యత ఆందోళనలకు కారణమవుతోంది. మెసేజ్‌లను థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా చూడొచ్చు. వాట్సాప్ లాంటి గ్లోబల్ దిగ్గజానికి దీటుగా నిలవాలంటే ఈ లోటును భర్తీ చేయాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరట్టై స్థానిక యాప్‌గా ప్రస్తుతం ఆదరణ పొందుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్లు చేసుకుంటూ కొత్త ఫీచర్లు చేర్చుకుంటూ వెళితే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ లో శ్రీలీల, సాయి పల్లవి తొలి అడుగులు
ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్
పక్కా ప్లానింగ్‌తో నేచురల్ స్టార్ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే
స్టార్ హీరోయిన్స్ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా
తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్