ఇది ఎంతవరకు నిజం అనేది.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం అయిందని.. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో సక్సెస్ అయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 15 వరకు రెండో రైలు కూడా పూర్తి అవుతుందని ఈ రెండు రైళ్లు సిద్ధం అయిన తర్వాత.. వాటిని ఒకేసారి ప్రారంభించినున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించడానికి గల కారణాన్ని కూడా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు నిరంతరంగా ప్రయాణికులు సేవలు అందించాలంటే.. ఒక రైలు సరిపోదని.. అందుకు రెండు రైళ్లు అవసరం అవుతాయని చెప్పారు. అందుకే రెండో రైలు పూర్తి అయ్యేవరకు వేచి చూస్తున్నట్లు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది
తెలంగాణకు డబుల్ అలర్ట్ పొంచి ఉన్న అతి భారీవర్షాలు
ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం
GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి