నాగినీ సీరియల్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ చిన్నది. దీంతో ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
బుల్లితెపై తెచ్చుకున్న క్రేజ్‌తో వెండితెరపైకి అడుగు పెట్టి అక్కడ కూడా తన నటనతో సత్తా చాటింది. మౌనీ రాయ్ బ్రహ్మాస్త్రం మూవీలో కీలక పాత్రలో నటించడమే కాకుండా కేజీఎఫ్‌లో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ఏడారిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ బ్యూటీ దుబాయ్ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మధ్య ఈ అమ్మడు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిన్నది దుబాయ్ లో కనిపించడం అందిరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
తాజాగా మౌనీరాయ్ షేర్ చేసిన ఫొటోల్లో, ఈ బ్యూటీ బ్లూకలర్ డ్రెస్‌లో అదరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోస్ షేర్ చేస్తూ..లోకేషన్ టూ డే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి