లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్.. మెగా హీరో సినిమా వదులున్న బ్యూటీ..

లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్.. మెగా హీరో సినిమా వదులున్న బ్యూటీ..


సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుంటారు. అవకాశం రావడమే గొప్ప అనుకుంటే వచ్చిన అవకాశాలు వదులుకోవడం అనేది నిజంగా కెరీర్ పోగొట్టుకున్నట్టే.. ఓ ముద్దుగుమ్మ ఏకంగా మెగా హీరోతో సినిమా ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె మిస్ చేసుకున్న సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఎదో కాదు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన. చిన్న సినిమా వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఏకంగా 100కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..

ఈ సినిమాతో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మంగుళూరు బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యూట్ స్మైల్ తో పాటు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాను ఓ క్రేజీ హీరోయిన్ మిస్ చేసుకుందని మీకు తెలుసా..? అవును ఉప్పెన సినిమా ఆఫర్ ముందుగా ఓ హీరోయిన్ దగ్గరకు వెళ్ళింది కానీ ఆతర్వాత కృతి శెట్టి దగ్గరకు వచ్చింది ఆ సినిమా..

6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

ఉప్పెన సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్. ఉప్పెన సినిమా ఆఫర్ వచ్చిందని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గతంలో శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఉప్పెన సినిమాలో ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమా కథ ముందుగా రాసుకుందానికి ఇప్పుడు తీసిందానికి చాలా తేడా ఉంది. ముందుగా కథను బోల్డ్ గా రాశారు. నాకు కథ చెప్పినప్పుడు అదే బోల్డ్ స్టోరీ చెప్పారు. అందులో లిప్ లాక్స్, అలాగే మరికొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. నేను అప్పుడు అంతగా కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. నాకు భయం వేసింది. ఇప్పుడు కూడా ఇంటిమెంట్ సీన్ చేయాలంటే నన్ను కన్విన్స్ చేయాలి.. నేను ఎంతవరకు ఆ సీన్స్ చేయగలనో చెప్పలేను అని చెప్పుకొచ్చింది శివాని. దానివల్లే తాను ఉప్పెన సినిమా ఆఫర్ వదులుకున్నాను అని తెలిపింది.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *