ఈ వైరల్ బిల్లు బైక్ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు జార్ఖండ్‌లోని సందీప్ ఆటో డీలర్‌కు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉంది. ఈ వ్యత్యాసం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. బుల్లెట్ 350 మోడల్‌లో డిజైన్ కొంత మారినప్పటికీ మొదటి రూపం దాదాపు అలాగే ఉంది. ఇదే ప్రజల అభిమానాన్ని కోల్పోకుండా చేసింది. 1986లో ఈ బైక్‌ని ‘ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ అని పిలిచేవారు. బుల్లెట్ ఇప్పుడు రెండు వేరియంట్లలో… అంటే స్టాండర్డ్ బుల్లెట్ 350, బుల్లెట్ 350 ESగా అందుబాటులో ఉన్నాయి. అప్‌డేట్‌ల కారణంగా బుల్లెట్ 350 ధర గణనీయంగా పెరిగింది. 1986లో రూ.18,700తో కొన్న బైక్ ఇప్పుడు పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఈ వైరల్ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు నెటిజన్లు ఆశ్చర్యపోతూ, “అప్పటి రూ.18,700 ఇప్పటి లక్షల రూపాయిలకు సమానం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ బిల్ నెటిజన్లను … రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్ర తెలుసుకునేలా చేస్తోంది. 1901లో ఈ కంపెనీని స్థాపించగా, 1932 నుంచి తొలి బుల్లెట్ మోడల్ ఉత్పత్తి మొదలైంది. రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇది ఎంతో ఉపయోగపడింది. మన దేశంలో 1955 నుంచి బుల్లెట్ ప్రొడక్షన్ మొదలైంది. 1986 మోడల్‌ని అప్పటి ఆర్థిక పరిస్థితుల్లో లగ్జరీగా భావించేవారు. మొత్తంగా 1986 బిల్ వైరల్ అవ్వడం గతం, వర్తమానం మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?