సెలబ్రెటీల లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు. బ్రాండెడ్ బట్టలు, వాచ్ లు అన్ని ఇలా ఖరీదైన వాటినే వాడుతూ ఉంటారు. ఒకొక్క సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. వారి లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే సీరియల్ బ్యూటీస్ కూడా హీరోయిన్స్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. ఎపిసోడ్ ఎపిసోడ్ కు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. అయితే ఓ స్టార్ సీరియల్ నటి మాత్రం తనకు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం తప్ప తనకు ఇంకేం లేదు అని తెలిపింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఓ తెలుగు సీరియల్ నటి. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతకూ ఆ సీరియల్ నటి ఎవరు..?
హీరోయిన్గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?
తెలుగులో సీరియల్స్ కు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ వస్తే చాలు లేడీస్ కదలకుండా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇక సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దీపికా రంగరాజు ఒకరు. తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ తమిళ ఛానెల్లో న్యూస్ ప్రజెంటర్గా కెరీర్ ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక 2023లో బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.ఇక తెలుగు నాట బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న టీవీ సీరియల్స్ లో బ్రహ్మముడి కూడా ఒకటి. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ భార్య కావ్య పాత్రలో దీపిక రంగరాజు అద్భుతంగా నటించింది. ఈ సీరియల్ తో దీపిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా రంగరాజు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు సొంత ఇల్లు లేదు. చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలి అనేది నా కోరిక. నాకు శ్మశానంలో ఒక ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది. అది తప్ప నాకు ఇంకేం ఆస్తుపాస్తులు లేవు. నేను కోట్లల్లో సంపాదించడంలేదు.. లక్షల్లోనే సంపాదిస్తున్నా. నాకు క్రేజ్, పాపులారిటీ బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చింది. ఈ సీరియల్ కంటే ముందు నేను ఎవ్వరికీ తెలియదు. చెన్నైలో ఒక్క అపార్ట్ మెంట్ కొనాలంటే కోట్లు ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.