గగనతలం దాటి, సీరియస్‌గా సముద్ర జలాల మీదకి మళ్లింది అమెరికా-ఇరాన్ యుద్ధం. ఇక, తగలెడదామా? అంటూ అటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్యలో ఇజ్రాయెల్ కౌంటర్ ఎటాక్స్‌తో రెచ్చిపోతున్నాయి. బుధవారం (మార్చి 04) ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా సబ్‌మెరైన్ టొర్పిడో నీళ్లలో ముంచేసింది. 87మందిని చంపేసి, మారణహోమం సృష్టించింది. ఇది జరిగి కొన్ని గంటలే అయింది. అంతలోనే ఇరాన్ నౌక మరొకటి శ్రీలంక దగ్గర లంగరెయ్యబోతోంది. స్వయంగా పార్లమెంటులో శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా చెప్పిన విషయం ఇది. ప్రపంచం మొత్తాన్ని మరోసారి శ్రీలంక వైపు ఫోకస్ చేసింది.
మా దేశ ప్రాదేశిక జలాలకు దగ్గరలో ఆ నౌక తచ్చట్లాడుతోంది. విపత్తు ఏదైనా జరిగితే అందులో సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తామనిమంత్రి జయతిస్సా అన్నారు. ఈ మిస్టీరియస్ నౌకపై అమెరికా దాడి చేయొచ్చన్న ఆందోళన కూడా లేకపోలేదు. ఈ షిప్పులో దాదాపు 100 మంది క్రూ ఉన్నట్టు.. అధునాతన క్షిపణులు, ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఇరాన్ రెండో వార్‌షిప్ టార్గెట్ ఏమై ఉంటుంది?
శ్రీలంకను స్థావరంగా చేసుకుని ఇండియన్ టెరిటరీని టార్గెట్ చెయ్యబోతోందా? ఈ నేపథ్యంలోనే లంకకు అతి దగ్గరలో ఉన్న చెన్నై నగరంలోని అమెరికన్ కాన్సులేట్. అందుకే, భద్రత కట్టుదిట్టం చేశారు.అటు, కేరళ, కోస్తాంధ్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కూడా హైఅలర్ట్ తప్పలేదు. విశాఖ నేవీ ఫ్లీట్‌లో పాల్గొని రిటర్న్ జర్నీ అవుతుండగానే IRIS దేనా యుద్ధనౌకను అమెరికా పేల్చివేసింది. వైజాగ్ కోస్ట్ మీద కూడా ఓ కన్నేసి ఉంచింది ఇండియన్ నేవీ.
శ్రీలంక టెరిటోరియల్ వాటర్స్‌కి అవతల, శ్రీలంక ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్లో ప్రస్తుతం ఈ నౌక ఉంది. ఆ దేశ వాణిజ్య అవసరాల కోసం వచ్చే నౌకలన్నీ అక్కడివరకూ రావొచ్చు. అలాగే వచ్చింది ఈ ఇరాన్ యుద్ధనౌక. అత్యవసర పోర్ట్ కాల్ కోసం లంక ప్రభుత్వం నుంచి పర్మిషన్ అడుగుతోంది. క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోందని శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్సా ట్వీట్ చేసి ప్రపంచానికి తెలియజేశారు. ఆ షిప్పును అనుమతించాలా వద్దా.. అనుమతిస్తే మనకొచ్చే ప్రమాదం ఏంటి అని తర్జనభర్జన పడుతోంది లంక ప్రభుత్వం.
1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లో లంకకు ఇటువంటిదే ఒక క్లిష్ట సమస్య వచ్చింది. భారత గగనతలాన్ని మూసి వేయడంతో పాకిస్తాన్ యుద్ధ విమానం ఇంధనం కోసం శ్రీలంకను రిక్వెస్ట్ చేసింది. అప్పుడు మానవతా దృక్పథంతో ఓకే చెప్పారు అప్పటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే. ఇప్పుడు ఇరాన్ నౌక విషయంలో కూడా సిరిమావో పాలసీనే అడాప్ట్ చేసుకోవాలని లంక ఆలోచిస్తోంది.
ఇదిలావుంటే, బుధవారం జరిగిన సబ్‌మెరైన్ అటాక్‌ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుంది. ప్రతీకారం తీర్చుకుంటామని, అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా ప్రాపర్టీస్ ఎక్కడున్నా పేల్చివేసుడే అని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ కాన్సులేట్లు, సైనిక స్థావరాలు, మరీ ముఖ్యంగా శాటిలైట్ కేంద్రాలు, ఏఐ డేటా సెంటర్లు దాదాపుగా అన్నింటికీ థ్రెట్ ఉన్నట్టే..! ఇరాన్ రాడార్లోకి చేరిపోయినవే. ఇప్పుడు శ్రీలంక కోస్ట్‌కి దగ్గరగా లంగరెయ్యబోతున్న ఇరాన్ వార్‌షిప్ లక్ష్యం ఏంటి..? అనేది బిగ్ మిస్టరీగా మారింది..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..