రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌

రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌


ఇతర హీరోల మాదిరిగా కాకుండా ధనుష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్పమనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ మృతికి సంతాపం తెలిపారు. ఇంటికెళ్లి మరీ ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు రోబో శంకర్. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లుతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు ఇప్పుడు 46 ఏళ్లు. రోబో శంకర్ మృతి పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ శంకర్ మృతికి సంతాపం తెలిపారు. తాజాగా ధనుష్ రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. రోబో శంకర్ కూతురు లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్‌ను ధనుష్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారి, మారి 2 సినిమాలో ధనుష్ తో పాటు రోబో శంకర్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్‌లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది

TOP 9 ET News: NTRకి ప్రమాదం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

విజయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు

Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు

Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *