దీపావళి ముందు కేంద్ర మంత్రివర్గం గుడ్‌న్యూస్ ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు ఒక ప్రధాన బహుమతిని ఇచ్చింది . బుధవారం (సెప్టెంబర్ 24)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్, 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌గా రూ. 1,865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది. ఈ బోనస్‌ను దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ డబ్బును ట్రాక్ మెయింటెనెన్స్ చేసేవారితోపాటు, లోకో పైలట్లు, ట్రాక్ మేనేజర్లు (గార్డ్స్), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్‌మెన్ , రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, ఇతర గ్రూప్ సి ఉద్యోగులకు చెల్లిస్తారు.
అలాగే, పలు కీలక అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీహార్‌లోని భక్తియార్పూర్ -రాజ్‌గిర్ -తిలైయా రైల్వే లైన్‌ను రూ. 2,192 కోట్లతో డబుల్ లేనింగ్ చేయడానికి మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని NH-139W సాహిబ్‌గంజ్-అరెరాజ్-బెట్టియా విభాగంలో హైబ్రిడ్ యాన్యుటీ కర్వ్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మొత్తం ప్రాజెక్టు పొడవు 78.942 కిలోమీటర్లు. రూ 3,822.31 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..