రెండు చేతులకు వాచీలు.. చిన్నప్పుడే మ్యాగజైన్ కవర్ పేజీపై.. ఇప్పుడు 3వేల కోట్ల హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?

రెండు చేతులకు వాచీలు.. చిన్నప్పుడే మ్యాగజైన్ కవర్ పేజీపై.. ఇప్పుడు 3వేల కోట్ల హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?


రెండు చేతులకు వాచీలు పెట్టుకుని మ్యాగజైన్ కవర్ పేజీపై పోజులిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ పాప ఇప్పుడు ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. తన అందం, అభినయంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు లక్కీ హీరోయిన్ గా మారిందీ అందాల తార. అందుకే స్టార్ హీరోలు సైతం ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని, నితిన్ తదితర స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఇక తమిళలో ధనుష్, దళపతి విజయ్, కార్తీ, హిందీలో సల్మాన్‌ ఖాన్, రణ్ బీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. గత రెండేళ్ల కాలంలో ఈ ముద్దుగుమ్మ నటించిన వన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇవన్నీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినవే. ఆమె గత 4 సినిమాలను తీసుకుంటే అన్నీ కలిపి రూ. 3000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. అందులో ఒక సినిమానే 2వేల కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టి దేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు రష్మిక మందన్నా

2001లో ప్రచురితమైన తమిళ మ్యాగజైన్ ‘గోకులం’ కవర్ పేజీ కోసం రష్మిక ఇలా రెండు చేతులకు వాచీలు పెట్టుకుని పోజిచ్చింది. దీనిని ఒక సందర్భంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక ఇలా చెప్పుకొచ్చింది. ‘ నా ఫస్ట్‌ కవర్‌ పేజీ ఇది. అప్పుడు జరిగిన ఫొటోషూట్‌ నాకింకా గుర్తుంది. మా అమ్మగారు ఆ పత్రికను భద్రంగా దాచారు. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు’ అని పేర్కొంది. కాగా రష్మిక నటించిన చివరి నాలుగు సినిమాలు పుష్ప 2, ఛావా, సికిందర్, కుబేర సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రష్మిక మందన్నా లేటెస్ట్ ఫొటోస్..

ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ది గర్ల్ ఫ్రెండ్, థామా, కాక్ టెయిల్ 2 తో పాటు క్రిష్ 4లోనూ హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *