భీమవరంలోని త్యాగరాజు భవనంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ చేశారు. నాలుగు కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు. 10, 20, 50, 100, 200, 500 కరెన్సీ నోట్లను భక్తుల నుండి సేకరించారు. వాటిని మాలలుగా కట్టి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, మందిరం అంతా అలంకరించారు. కరెన్సీ రెండు కోట్లు, బంగారు బిస్కెట్లు , వెండి వస్తువులు మరో రెండు కోట్లు మొత్తం నాలుగు కోట్లుతో అలంకరణ జరిపారని భక్తులు చెబుతున్నారు. ఏటా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ఇలా కరెన్సీ, బంగారం, వెండితో వైభవంగా అలంకరిస్తారు. ఈ అవతారంలో మహాలక్ష్మి నే చూసినట్టు ఉంటుందని భక్తులు చెబుతారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కరెన్సీ, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు.. ఎవరివి వారికే తిరిగి ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cheeramenu Fish: పులస వెళ్లింది.. చీరమేను వచ్చింది..
కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె
అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!