దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం, భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు కళాత్మక మహత్తును పంచుతోంది. ఇండోర్‌లోని వీఐపీ పరస్పర్ నగర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఇందులో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన 12 జ్యోతిర్లింగాలు, ఇతర ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిని అనుసరించి ఆలయాల సెట్‌లు వేశారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 500 మందికి పైగా కళాకారులు మూడు నెలల పాటు అహర్నిశలు శ్రమించి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. భక్తుల విరాళాలతో కృష్ణగిరి పీఠాధిపతి వసంత్ విజయానంద్ గిరి మహారాజ్ ఆధ్వర్యంలో మండప నిర్మాణం జరిగింది. ఈ సువిశాల ప్రాంగణంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల యాగశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ 108 మంది పండితులు నవరాత్రి సందర్భంగా యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవరాత్రుల వేళ తరలివచ్చే లక్షలాది భక్తుల కోసం పార్కింగ్, భోజనాల ఏర్పాటు, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ మండపాన్ని సందర్శించే భక్తుల కోసం ప్రత్యేకంగా బంగారు కలశాలు కూడా అందుబాటులో ఉంచారు. వీటి ధరలు రూ.30 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటాయని సమాచారం. ఈ మండపంలో ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 150కే కార్టన్ బీర్లు, మేకపోతు.. బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్
పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
బాలాత్రిపురసుందరిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం
పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. పిడుగులతో కూడిన వర్షాలు