ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థను అభినందించారు. అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంఛింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంఛర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం. రైల్ నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్ టైమ్‌లో శత్రువు కంటపడకుండా దీనిని ప్రయోగించవచ్చు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త తరం క్షిపణి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదని, దీనిలో పలు అత్యాధునిక సాంకేతికతను పొందుపరిచారని ఆయన తెలిపారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అగ్నిఫ్రైమ్ క్షిపణిని 2010లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది అగ్ని-5 కంటే తేలికైందే గాక ప్రమాదకరమైంది కూడా. ఇందులో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షల్ నేవిగేషన్, మైక్రో ఇనర్షల్ నావిగేషన్ సిస్టమ్‌లను అమర్చారు. అలాగే, జీపీఎస్, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లకు కూడా దీన్ని వాడుకొనే ఆప్షన్ ఉంది. దీనివల్ల ఈ క్షిపణిలోని అధునాతన నావిగేషన్ వ్యవస్థ శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. ఈ క్షిపణిలో ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా దీనిని కోరుకున్న చోటికి ఈజీగా రవాణా చేసి భద్రపర్చవచ్చు. దీనివల్ల లాంచింగ్ టైం తగ్గుతుంది. తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో దీనిని.. ఓ డబ్బా వంటి యంత్రంలో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. పొగమంచులో, రాత్రిపూట కూడా ఇది లక్ష్యాలను 100 శాతం గ్యారెంటీతో ఛేదించగలదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్
ట్రంప్ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్ కానుందా
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్లో దూరి కరిచిన ఎలుక
చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ