రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా

రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా


టాలీవుడ్ యువ హీరోలు తమ సినిమా ఎంపికల్లో కొత్త రూట్ ను ఎంచుకుంటున్నారు. గత చిత్రాల ఇమేజ్‌కు భిన్నంగా కొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. కొందరు గత జానర్‌లు వర్కవుట్ కాకపోవడంతో, మరికొందరు కొత్తగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఈ జానర్ షిఫ్ట్ చేస్తున్నారు. ఈ కొత్త ఫార్ములా వెండితెరపై ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతం సంభ్రాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, పీరియాడిక్ మాస్ యాక్షన్ జానర్ నుండి తదుపరి ప్రాజెక్ట్ కోసం 360 డిగ్రీల మార్పును తీసుకుంటున్నారు. ఆయన సాఫ్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో విసుగు చెందిన రామ్ పోతినేని కూడా తన తదుపరి సినిమా విషయంలో రూటు మార్చారు. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాతో వరుస వైఫల్యాలకు బ్రేక్ పడుతుందని ఆయన నమ్ముతున్నారు. యువ హీరోలు మాత్రమే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. వరుసగా మాస్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తదుపరి ప్రాజెక్ట్‌లను స్టైలిష్ కమర్షియల్ మూవీస్‌గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాబోయే సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ

నిర్మాతకు రూ. 4.75 కోట్లు వాపస్ చేసిన హీరో

దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్‌’ టికెట్‌ ధర

అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు

ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *