రాజస్థాన్లోని జోథ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరంలో మండోర్ అనే గ్రామం ఉంది. ఇక్కడే రావణాసరుడి ఆలయం ఉంది. రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని స్థానికులు నమ్ముతారు. పూర్వం ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడట. అతని కుమార్తె మండోదరి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేదట. రావణాసురుడు ఒక యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే రావణాసురుడు ధర్మాత్మురాలైన మండోదరి గురించి విన్నాడట. తాను చేయబోతున్న యజ్ఞం కోసం మండోదరి అవసరం ఏర్పడిందట. దాంతో రావణుడు లంక నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడట. ఆమెను పెళ్లిచేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. మండోర్ ప్రజలు మాత్రం రావణుడి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయన శివభక్తిని, శక్తి సామర్థ్యాలను, మేధాశక్తిని ఇక్కడి వారు గౌరవిస్తుంటారు. అందుకే, దసరా రోజున దేశవ్యాప్తంగా రావణాసురుడి బొమ్మలు దహనం చేస్తే, ఇక్కడ మాత్రం రావణాసురుడి మృతికి సంతాపం ప్రకటిస్తుంటారు. ఆ రోజున దశ కంఠుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మండోర్లోని అమర్ నాథ్ ఆలయ ప్రాంగణంలో లంకాధిపతి ఆలయం ఉంది. ఇక్కడ రావణాసురుడిని దేవుడిగానే పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే మండోదరి విగ్రహం కూడా పూజలందుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావణ భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?
ఫైబర్ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!
బుడిపెలున్న చేపను చూసారా
ట్యాంక్‌లో ఇరుక్కున్న ఏనుగు.. ఎలా కాపాడారో చూడండి