ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. MLC యేసురత్నం గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారని..ఆయన పెట్టిన తప్పుడు కేసులు కూడా బయటికి తీస్తామన్నారు హోంమంత్రి అనిత.. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. తమపై గొడ్డలి వేటు, తల్లి చెల్లి పెట్టిన కేసులు లేవన్నారు హోంమంత్రి అనిత..
హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మంత్రి అనిత అనవర విషయాలు మాట్లాడుతున్నారని, 16 నెలలు గడిచినా గత ప్రభుత్వంపై నిందలకు పరిమితమవుతున్నారని బొత్స అన్నారు.
ఇవి కూడా చదవండి..
Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..
Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..