రవి, శనుల యుతి.. వారికి కష్టనష్టాలు, ఉద్యోగ సమస్యలు.. జాగ్రత్త..!

రవి, శనుల యుతి.. వారికి కష్టనష్టాలు, ఉద్యోగ సమస్యలు.. జాగ్రత్త..!


రవి, శనుల యుతి.. వారికి కష్టనష్టాలు, ఉద్యోగ సమస్యలు.. జాగ్రత్త..!

ఈ నెల (మార్చి) 14న మీన రాశిలో ప్రవేశిస్తున్న రవి అక్కడే సంచారం చేస్తున్న శనితో యుతి చెందడం జరుగుతుంది. రవికి శని కుమారుడే అయినప్పటికీ, వీరిద్దరూ బద్ధ శత్రువులు. వీరి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అధికారులతో విభేదాలు, అధికారుల ఆగ్రహానికి గురికావడం, తండ్రి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా లేకపోవడం, ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడడం జరుగుతాయి. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి ఈ రకమైన కష్టనష్టాలు తప్పకపో వచ్చు. రవి, శనులు మీన రాశిలో మే 14వరకూ కలిసి ఉంటాయి.

రవి, శనుల కలయిక ఈ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపనుందో ఇప్పుడు చూద్దాం..

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి, శనుల కలయిక వల్ల ఈ రాశి ఉద్యోగుల పట్ల అధికారుల వైఖరి మారే అవకాశం ఉంటుంది. అధికారుల నమ్మకం కోల్పోవడమే కాకుండా, అధికారుల ఆగ్రహానికి గురి కావడం కూడా జరుగుతుంది. ఉద్యోగానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మిక అనారోగ్యాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు తమకు ఇష్టం లేని ప్రాంతాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా ఇబ్బంది పెడతాయి.
  2. మిథునం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో రవి, శనుల యుతి వల్ల ఉద్యోగ జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విధి నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. నిరుద్యో గులకు సమయం ఏమంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. తండ్రితో విభేదాలు తలెత్తుతాయి. అపనిందలు భరించాల్సి వస్తుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి తన బద్ధ శత్రువైన శనితో అష్టమ స్థానంలో కలవడం వల్ల నెల రోజుల పాటు ఈ రాశివారు అటు అధికారులతోనూ, ఇటు తండ్రితోనూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ నిర్మాణ వ్యవహారాల్లో కొద్దిగా మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంది. దుర్వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. కుటుంబ జీవితం కొద్దిగా సమస్యాత్మకంగా మారుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి, శనులు కలవడం వల్ల జీవిత భాగస్వామిని ఏదైనా అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం బాగా ఒత్తిడికి గురవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కుదరకపోవచ్చు. నిరుద్యోగులు ఇష్టం లేని ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఒత్తిడికి గురి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో నష్టపోవడం, మోసపోవడం జరుగుతుంది. తండ్రి అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, శనుల యుతి వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మరింత ముదిరే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఆటంకాలు, అవరోధాలు ఎక్కువగా కలు గుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. తరచూ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ తగ్గుతుంది.
  6. మీనం: ఈ రాశిలో శని, రవులు కలవడం వల్ల అంతుబట్టని అనారోగ్యాలు పీడించే అవకాశం ఉంది. తండ్రితో అకారణ వైరాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా తగ్గే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కలుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు చేజారుతాయి. ఆస్తి వివాదాలు ఒకపట్టాన పరిష్కారం కాకపోవచ్చు. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *