తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, రాహువుల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు కలుగు తాయి. ఆస్తి లాభం, భూలాభం కూడా కలుగుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రవి, రాహువులను గురువు వీక్షిస్తున్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా బాగా లాభిస్తాయి.