Headlines

యువతను బెంబేలెత్తిస్తున్న ప్యాటీ లివర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలసత్వం వద్దు!

యువతను బెంబేలెత్తిస్తున్న ప్యాటీ లివర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలసత్వం వద్దు!


యువతను బెంబేలెత్తిస్తున్న ప్యాటీ లివర్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలసత్వం వద్దు!

ఎప్పుడో 40, 50 ఏళ్లలో పలకరిచే ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పుడు యువతను పట్టి పీడిస్తుంది. ఫ్యాటీ లివర్‌ లక్షణాలు యువత, స్త్రీలు, పిల్లలలో కూడా కనిపిస్తున్నాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ఎందుకంటే ఈ రకమైన సమస్య మద్యపానం చేయనివారిలో కూడా కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఫ్యాటీ లివర్‌కు కారణమయ్యే కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏ రకమైన ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు, ఏది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

డాక్టర్ అజయ్ కుమార్ ప్రకారం.. కొంతమందికి ప్రతిరోజూ బయటి ఆహారాన్ని తినే అలవాటు ఉంటుందని, బయట కొన్ని ఆహారాలు శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనితోపాటు శీతల పానీయాలు, స్వీట్లు, వేయించిన ఆహారాలు తీసుకుంటారు. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

ఫ్యాటీ లివర్‌ ఎలా వస్తుంది?

కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందని డాక్టర్ అజయ్ అంటున్నారు. ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్ వంటి అనేక రూపాల్లో వస్తుంది. వీటిలో లివర్ సిర్రోసిస్ అత్యంత ప్రమాదకరమైనది. దీనికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావచ్చు. ఆల్కహాల్ తాగేవారిలో ఫ్యాటీ లివర్‌ వస్తుంది. ఇతరుల్లో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది.

ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

ఈ సమస్య లక్షణాలు ప్రారంభంలో అంతగా కనిపించవు. క్రమంగా ఈ లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిలో అలసట, ఉదరం కుడి వైపున స్వల్ప నొప్పి, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఫ్యాటీ లివర్ సమస్యను ప్రారంభ దశలో సులభంగా నియంత్రించవచ్చు. కానీ ఒకసారి లివర్ సిర్రోసిస్ సంభవించినట్లయితే రోగి పరిస్థితి దారుణంగా క్షీణిస్తుంది.

ఫ్యాటీ లివర్‌ నివారణకు ఏం చేయాలంటే..

  • మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి.
  • ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
  • బరువును అదుపులో ఉంచుకోవాలి.
  • చక్కెర, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *