మొబైల్‌ ఛార్జర్స్‌, కేబుల్స్‌ ఎక్కవశాతం తెల్లగానే ఎందుకు ఉంటాయి?.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మొబైల్‌ ఛార్జర్స్‌, కేబుల్స్‌ ఎక్కవశాతం తెల్లగానే ఎందుకు ఉంటాయి?.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!


ప్రజెంట్‌ డేస్‌తో స్మార్ట్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో బాగమైపోయింది. మార్కెట్‌లో మనకు దొరికే ఫోన్స్‌ను ఒక్కో బ్రాండ్‌ ఒక్కో రంగులో అందుబాటులోకి తెస్తుంది. కానీ ఆయా కంపెనీలన్ని తమ ఛార్జర్, వాటి కేబుల్స్‌ను మాత్రం తెలుపు రంగులోనే తయారు చేస్తాయి. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. మనం ఛార్జర్ యూజ్‌ చేసేప్పుడు అది వేడెక్కడం సాధారణం. అయితే తెలుపు రంగు వేడిని త్వరగా గ్రహించదు. దీని వలన ఛార్జర్ ఎక్కువసేపు వేడెక్కకుండా సురక్షితంగా చేస్తుంది. అలాగే, తెల్లటి ఉపరితలంపై ఏవైనా గీతలు పడినా, కాలిన గుర్తులు ఉన్నా దాన్ని మనం వెంటనే గమనించి జాగ్రత్త పడవచ్చు. కాబట్టి కంపెనీలు ఈ కారణాల దృశ్యా చార్జర్లను తెలుపు రంగులో తయారు చేస్తాయి.

ఉత్పత్తి ఖర్చులను తగ్గించే రహస్యం

ఛార్జర్‌లను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది. దీనికి అదనపు రంగును జోడించడానికి తయారీదారులు అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని తెలుపు రంగులో తయారు చేస్తే, ప్రాసెసింగ్ తగ్గుతుంది అలాగే ఉత్పత్తి ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇది కంపెనీలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్లలు ఎక్కవగా తెలుపు రంగులోనే వాటిని తయారు చేసేందుకు మొగ్గుచూపుతారు.

ఆపిల్ ప్రభావం మరియు బ్రాండ్ ఇమేజ్

మొబైల్‌ ఫోన్‌లలో అత్యంత ప్రాధాన్యత పొందిన ఆపిల్ తన అన్ని ఛార్జర్‌లు, కేబుల్‌లను తెలుపు రంగులో తయారు చేస్తుంది. దీంతో వాటికి ప్రీమియం లుక్‌తో పాటు బ్రాండ్‌ వ్యాల్యూ కూడా వచ్చింది. ఆపిల్ బ్రాండ్‌ నుంచి ఇన్‌స్పైర్‌ అయిన చాలా కంపెనీలు తమ చార్జర్లను వైట్‌ కలర్‌లో తయారు చేయడం ప్రారంభించాయి. దీని కారణంగా, తెల్లటి ఛార్జర్‌లు మార్కెట్లో పెరిగాయి.

నలుపు రంగు ఛార్జర్లు ఎందుకు నాసిరకం?

మనం చిన్నప్పుడు యూజ్‌ చేసే కీ ప్యాడ్‌ మొబైల్స్‌కు ఎక్కవగా నలుపు రంగు చార్జర్లు వచ్చేవి. నలుపు లేదా ముదురు రంగు ఛార్జర్లు వేడిని త్వరగా గ్రహిస్తాయి. దీనివల్ల అవి వేడెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అవి పాడైపోయినా, కాలిపోయినా వాటిని త్వరగా గుర్తించడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ నలుపు రంగు ఛార్జర్ చెడ్డదని కాదు, తెలుపు రంగుతో పోలిస్తే ఇది తక్కువ ఉపయోగకరంగా ఉంటుందని మాత్రమే చెప్పవచ్చు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *