
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను విధానసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ మరియు సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారుల్లో అనేక రకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నొక్కి చెప్పారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాలను నివారించడం కోసమే ఈ చర్య తీసుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వివరించింది. డిజిటల్ వ్యసనం, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్, అధిక స్క్రీన్ సమయం వంటి ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పిల్లల ఆన్‌లైన్ భద్రతకు, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anasuya: వీళ్లను వదిలేస్తే మానవత్వం మరిచిపోతారని వార్నింగ్ ఇచ్చిన అనసూయ
Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
US-Israel-Iran Conflict: ఇప్పటివరకు ఇరాన్ లో 3వేలకు పైగా ఇళ్లు నేలమట్టం
Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్