మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి

మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి


రానున్న ద‌శాబ్ధాల్లో ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల నిరంత‌ర చ‌ర్య‌ల వ‌ల్ల ఈ సక్సెస్ సాధ్య‌మైంది. యూఎన్ వ‌ర‌ల్డ్ మెటియోరోలాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ దీనిపై కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం గ‌తంతో పోలిస్తే 2024లో చిన్న‌దైంది. ఐక్య‌రాజ్య‌స‌మితి చీఫ్ ఆంటోనియో గుటెర్ర‌స్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓజోన్ పొర కోలుకుంటోంద‌న్నారు. శాస్త్ర‌వేత్త‌లు ఇచ్చిన హెచ్చ‌రిక‌లు ప‌నిచేసిన‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుంద‌నీ ఇది శాస్త్ర‌వేత్త‌ల ఘ‌న‌తేననీ అన్నారు. క్లోరోఫ్లోరో కార్బ‌న్స్ వినియోగంపై అంత‌ర్జాతీయంగా ఒత్తిడి తేవ‌డం వ‌ల్లే ఓజోన్ పొర బ‌ల‌హీన‌ప‌డ‌డం ఆగిన‌ట్లు చెప్పారు. స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌రిణామాల వ‌ల్లే ఓజోన్ పొర స‌న్న‌గిల్ల‌డం నిలిచిపోయింది. ఓజోన్ పొర దెబ్బతినడం పై ఆ నాటి వియ‌న్నా క‌న్వెన్ష‌న్ లో ప్ర‌పంచ దేశాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసాయి. 1975లో ఆ క‌న్వెన్ష‌న్ జ‌రిగింది. ఆ త‌ర్వాత 1987లో మాంట్రియ‌ల్ ప్రోటోకాల్ రిలీజ్ అయింది. రిఫ్రిజిరేట‌ర్లు, ఎయిర్ కండీష‌న‌ర్లలో ఓజోన్ పొర‌ను బ‌ల‌హీన‌ప‌రిచే ప‌దార్ధాల వినియోగాన్ని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం ఓజోన్ పొర రిక‌వ‌రీ ట్రాక్‌లో ఉంది. ఈ శ‌తాబ్ధం మ‌ధ్య కాలం వ‌ర‌కు .. 1980 త‌ర‌హా స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుంద‌ట. దీని వ‌ల్ల స్కిన్ క్యాన్స‌ర్లు, కాట‌రాక్టులు త‌గ్గుతాయి. అతినీల‌లోహిత కిర‌ణాల వ‌ల్ల జ‌రిగే న‌ష్టాలు ఇక ఉండవు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌

కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది

TOP 9 ET News: NTRకి ప్రమాదం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

విజయ్‌ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *