ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి.. ‘ 22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటికి 47 ఏళ్లయింది. నటుడిగా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబసభ్యుడిగా, మెగాస్టార్‌గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు సినీ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు మెగాస్టార్. ఇక చిరంజీవి ట్వీట్ కు స్పందించిన పవన్ కల్యాణ్ తన అన్నయ్యకు అభినందనలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు. ఇతరులకు అండగా నిలిచే గుణాన్ని, సాయపడే అలవాటును ఎప్పుడూ వదులుకోలేదు. మా పెద్దన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని, ఆయన కోరుకుంటే తప్ప రిటైర్‌మెంట్ ఉండదని’ పవన్ చిరంజీవికి విషెస్ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అమ్ములపొదిలో మరో అస్త్రం.. ఇక రైలు నుంచే శత్రువులకు చుక్కలు
బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్
ట్రంప్ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్ కానుందా
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక