
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతనొక టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్. ఏపీలోని ఏలూరులో పుట్టి పెరిగాడు. అయితే ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలో జాబ్ కూడా చేశాడు. కానీ డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంగ్లిష్ లోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. ఆ తర్వాత మెగా ఫొన్ పట్టుకుని డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోన అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక రెండో సినిమా అయితే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ మూవీకి వచ్చాయి. అయితే దీని తర్వాత ఈ డైరెక్టర్ తీసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ కథ, స్క్రీన్ ప్లే అంశాల్లో మాత్రం ఈ డైరెక్టర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2005 నుంచి ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాలే తీసి వెర్సటైల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను మరెవరో కాదు ఇటీవల మయసభ వెబ్ సిరీస్ తో అందరి మన్ననలు అందుకున్న దేవా కట్టా.
విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన దేవా కట్టా ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ లో చాలా రోజుల పాటు పని చేశారు. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వెన్నెలతో మొదటి సారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. ప్రస్థానం సినిమాతో విమర్శకల ప్రశంసలు అందుకున్నాడు. నాగ చైతన్య ఆటో నగర్ సూర్య, మంచు విష్ణుతో డైనమెట్, సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమాలు చేసి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
దేవా కట్టా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇటీవలే దేవా కట్టా తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టింది. ఇక నటన పరంగా.. డీ ఫర్ దొపిడీ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించడు దేవా కట్టా. పైన ఉన్న ఫొటో అదే.
మయ సభ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో డైరెక్టర్ దేవా కట్టా, ఐశ్వర్యా రాజేష్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.