
భారీ వర్షాలు వరదల కారణంగా మూసీ నది ఉప్పొంగుతోంది. మూసి వరదలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. ఆ వరదతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే అదే విధంగా మూసీ నదిలో నుంచి విష సర్పాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువ జనావాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతంలో మరోసారి కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భారీగా వరద నీరు రావడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి వరద నీరు చేరుకోవడంతో కొండచిలువ బయటికి వచ్చింది. మూసీ పరివాహక ప్రాంతంలోని చికెన్ షాప్‌లోకి కొండచిలువ వచ్చి చేరింది. దీన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను అక్కడి నుంచి తరలించారు. కాగా 15 రోజుల క్రితం కూడా అదే ప్రాంతంలో కొండచిలువ కనబడి కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తునర్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..