
మనం మన ఇంటిని కొన్ని రోజులు ఖాళీగా ఉంచితేనే దుమ్ము ధూళి పేరుకుపోతుంది. అలాంటిది ఏకంగా మూడేళ్ల పాటు ఒక అపార్ట్‌మెంట్‌కు తాళం వేసి ఉంచితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తాజాగా ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తి, వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాల వల్ల తన ఫ్లాట్‌కు తాళం వేసి సుమారు మూడు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నాడు. ఇటీవల అతను తిరిగి వచ్చి తలుపులు తెరిచి చూడగా, లోపల ఉన్న దృశ్యం చూసి అతని కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. ఇల్లంతా పావురాల రెట్టలతో నిండిపోయి, తీవ్రమైన దుర్వాసన వస్తోంది. సోఫాలు, బెడ్లు, కిచెన్ ప్లాట్‌ఫారమ్.. ఇలా ప్రతి వస్తువుపై పావురాల విసర్జితాలు పేరుకుపోయాయి.
ఫ్లాట్ కిటికీలు సరిగ్గా మూసివేయకపోవడమో లేదా బాల్కనీ వైపు నుండి చిన్న సందు ఉండటమో గమనించిన పావురాలు లోపలికి ప్రవేశించాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో అవి అక్కడ స్వేచ్ఛగా గూళ్లు కట్టుకుని నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ మూడేళ్లలో అవి వందల సంఖ్యలో సంతానాన్ని వృద్ధి చేసుకున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఆ ఇల్లు ఇప్పుడు మనుషులు ఉండటానికి ఏమాత్రం యోగ్యంగా లేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది అపార్ట్‌మెంట్ లా లేదు, ఒక పెద్ద పావురాల గూడులా ఉంది అని ఒకరు వ్యాఖ్యానించగా, ఇంత గందరగోళాన్ని శుభ్రం చేయడం యజమాని వల్ల అయ్యే పని కాదు, దీనికి ప్రొఫెషనల్ క్లీనర్లు కావాలి అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఇల్లు ఖాళీగా ఉంచే వారికి ఒక హెచ్చరిక లాంటిది. సుదీర్ఘ కాలం పాటు ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు కిటికీలు, వెంటిలేటర్లు పకడ్బందీగా మూసివేయాలని, వీలైతే మధ్యమధ్యలో ఎవరినైనా పంపి క్లీన్ చేయించాలని ఈ వీడియో నిరూపిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…