కొన్ని జంతువు తినకుండా వారం రోజుల వరకు ఉంటాయి. ఉదాహరణకు సింహం ఒక్కసారి వేటాడితే అది కొన్ని రోజుల వరకు ఏది తినకుండా ఉంటుంది. కానీ మన పరిసరాల్లో వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే నత్త మాత్రం ఎలాంటి ఆహారం తీసుకోకుండా మూడేళ్ల వరకు జీవించగలదట. ఎలా అంటే ఇది చాలా సంవత్సరాల పాటు నిద్రపోవడం ద్వారా తన జీవితాన్ని కొనసాగిస్తుందట. అందుకే శాస్త్రవేత్తలు దీనిని నిద్రాణస్థితి అని పిలుస్తారు. నిద్రాణస్థితి అంటే జీవులు తమ శరీర శక్తిని ఆదా చేసుకోవడానికి గాఢనిద్రలోకి వెళ్లడం. నిత్త కూడా తనను తాను రక్షించుకునేందుకు వేసవి కాలంలో లేదా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తుందట.
ఎందుకంటే వేడి, పొడి వాతావరణంలో ఈ నత్తలకు జీవనం చాలా ఇబ్బందికరంగా ఉంటుందట.. ఈ వాతావరణ పరిస్థితులను అవి ఎక్కువగా తట్టుకోలేవట. అలాంటి సందర్భాలలో, ఈ నత్తలు తమ పెంకుల్లో దాక్కుని మూడు నుండి ఆరు సంవత్సరాలు తినకుండా జీవిస్తాయట. వాతావరణం మారి వర్షాకాలం వచ్చే వరకు అవి నిద్రాణస్థితిలో గడుపుతాయిట. తిరిగి వర్షాకాలం రాగానే, నత్త తన పెంకు నుండి బయటకు వచ్చి తన సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తాయట.
మనం సాధారణంగా గమనించే చాలా జంతువుల్లో అసాధారణ శక్తులు ఉంటాయి. ఒక నత్త మూడు సంవత్సరాలు తినకుండా జీవించగలదనే వాస్తవం జీవశాస్త్రంలో దానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంది. మానవ అవగాహనకు అతీతంగా ఉన్న ప్రకృతి రహస్యాలు ఎల్లప్పుడూ మనల్ని ఆకర్షిస్తుంటాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.