మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రష్మిక, విజయ్.. వరుడి తరపున పెళ్లి కూతురుకు కళ్లు చెదిరే బహుమతి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రష్మిక, విజయ్.. వరుడి తరపున పెళ్లి కూతురుకు కళ్లు చెదిరే బహుమతి


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా వేడుకగా జరిగిన మూడు ముళ్ల పండక్కి అత్యంత ఆత్మీయులు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం నిర్వహించిన పెళ్లి కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకునేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఏర్పాటు చేయించుకున్నారు.

ఇక నేడు తెల్లవారు జాము నుంచే పెళ్లి తంతు మొదలైంది. గులాబీ రేకులు, సుగంద ద్రవ్యాలు నిండిన నీళ్లతో వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. ఆ తర్వాత వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. వరుడి తరుపున పెళ్లి కూతురుకు బంగారు గాజులు బహుకరించారు. అత్యంత ఆత్మీయలు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

విజయ్ దేవరకొండ, రష్మిక కొన్నేళ్లుగా కంటున్న కల ఇవాళ్టికి నెరవేరింది. గీత గోవిందంతో మొదలైన వారి పరిచయం డియర్ కామ్రెడ్‌కు వచ్చే సరికి ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రణబాలి షూటింగ్ దశలో ఉంది. ముచ్చటగా మూడో సినిమా నాటికి మూడు ముళ్ల బంధంతో రష్మిక, విజయ్ ఒక్కటయ్యారు. రష్మిక మందన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుటి నుంచీ విజయ్ దేవరకొండ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. దేవరకొండ ఫ్యామిలీకి అవసరమైనప్పుడల్లా తాను ఉంటానని సందర్భం వచ్చినప్పుడుల్లా రష్మిక చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ జంట ఒక్కటవ్వడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *