మీ ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ఎటువైపు ఉంది.. ఇది తెలుసుకోకపోతే దరిద్రం అస్సలు వదిలిపెట్టదు..!

మీ ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ఎటువైపు ఉంది.. ఇది తెలుసుకోకపోతే దరిద్రం అస్సలు వదిలిపెట్టదు..!


మీ ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ఎటువైపు ఉంది.. ఇది తెలుసుకోకపోతే దరిద్రం అస్సలు వదిలిపెట్టదు..!

చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు హాల్, కిచెన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కానీ బెడ్‌రూమ్, బాత్రూమ్ దిశల విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగదిలో మంచం, బాత్రూమ్ నిర్మాణం సరిగ్గా లేకపోతే అది ఇంట్లో నిరంతరం ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా బెడ్‌కు ఎదురుగా బాత్రూమ్ ఉండటం వల్ల కలిగే నష్టాలు, వాటికి పరిష్కార మార్గాలను వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

రాహువు ప్రభావం.. ప్రతికూల శక్తి

వాస్తులో బాత్రూమ్‌ను నీటి మూలకంతో పాటు రాహువు*ప్రతికూల శక్తి పెరిగే ప్రదేశంగా పరిగణిస్తారు. బెడ్‌రూమ్‌లో మంచానికి సరిగ్గా ఎదురుగా బాత్రూమ్ ఉండటం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ నేరుగా పడుకునే వారిపై ప్రభావం చూపుతుంది. చాలామంది రాత్రిపూట తెలియకుండానే బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంచుతుంటారు. దీనివల్ల ప్రతికూల శక్తి బెడ్‌రూమ్ అంతా వ్యాపించి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

కుటుంబ కలహాలు.. ఆర్థిక నష్టాలు

పడకగదిలో ఇలాంటి వాస్తు దోషాలు ఉండటం వల్ల ప్రధానంగా రెండు రకాల నష్టాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావడం, చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు ఏర్పడటం జరుగుతుంది. ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తి వల్ల సంపద నిలవదు. అనవసరమైన ఖర్చులు పెరగడంతో పాటు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.

సులువైన వాస్తు నివారణలు ఇవే

ఒకవేళ మీ ఇంట్లో కూడా మంచానికి ఎదురుగా బాత్రూమ్ ఉంటే.. భయపడాల్సిన పనిలేదు. ఈ చిన్న చిన్న మార్పులతో ఆ దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

తలుపులు వేసి ఉంచండి: బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ తలుపులు మూసి ఉంచడం అలవాటు చేసుకోవాలి.

కర్టెన్లు వాడండి: మంచం, బాత్రూమ్ తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే, బాత్రూమ్ తలుపుకు ఒక దట్టమైన కర్టెన్ వేలాడదీయండి. ఇది శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

చిన్న మార్పు – పెద్ద ఫలితం: ఈ చిన్న జాగ్రత్తలు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును పెంచుతాయి.

గుర్తుంచుకోండి.. ఇంట్లో సరైన శక్తి సమతుల్యత ఉంటేనే ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి మీ పడకగదిలో ఇలాంటి వాస్తు లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *