మీరేం మనుషులు రా.. కోడలిని ఇంట్లో బంధించి.. పామును వదిలారు.. ఆ తర్వాత..

మీరేం మనుషులు రా.. కోడలిని ఇంట్లో బంధించి.. పామును వదిలారు.. ఆ తర్వాత..


మీరేం మనుషులు రా.. కోడలిని ఇంట్లో బంధించి.. పామును వదిలారు.. ఆ తర్వాత..

అదనపు కట్నం.. ఎంతో మంది మహిళల ప్రాణం తీస్తుంది. ఇచ్చిన కట్నం చాలక ధనదాహంతో మరిన్ని డబ్బులు తేవాలంటూ అత్తింటివారు కోడళ్లపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు భరించలేక ఇప్పటికే ఎంతోమంది మహిళలు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన కట్నం కోసం అత్తమామలు ఎంతకైనా తెగిస్తారనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అదనపు కట్నం కోసం ఓ మహిళను అత్తమామలు గదిలో బంధించి పైపు ద్వారా పామును లోపలికి పంపి కాటు వేయించారు. ఈ దారుణ ఘటన నుంచి ఆ మహిళ చాకచక్యంగా బయటపడింది.

2021లో రేష్మ అనే యువతికి షానవాజ్ అనే వ్యక్తితో పెళ్లయింది. మొదట్లో బాగానే ఉన్న అత్తమామలు, భర్త కొన్నాళ్లకు అదనపు కట్నం కోసం రేష్మను వేధించడం మొదలుపెట్టారు. అప్పులు చేసి పెళ్లి చేసిన తన కుటుంబానికి మరో సమస్య కాకూడదని భావించిన రేష్మ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబం ఎలాగోలా రూ.1.5 లక్షలు కట్నంగా ఇచ్చింది. కానీ అత్తింటివారు మరో రూ. 5 లక్షలు కావాలని వేధించారు.

ప్రాణాలను తీయాలని ప్లాన్

రేష్మ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెను చంపాలని అత్తమామలు కన్నింగ్ ప్లాన్ చేశారు. కానీ నేరుగా చంపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి.. పథకం ప్రకారం ఆమెను ఒక గదిలో బంధించారు. ఆ గదిలోకి డ్రైన్ పైపు ద్వారా ఒక పామును వదిలారు. ఆ పాము రేష్మ కాలుపై కాటు వేసింది. నొప్పి భరించలేక ఆమె తలుపులు తీయమని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. అదృష్టవశాత్తూ గదిలో దొరికిన ఫోన్‌తో తన సోదరికి జరిగిన విషయం చెప్పింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె సోదరి, రేష్మను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

కఠినంగా శిక్షించాలని

ఈ ఘటనపై రేష్మ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తమ బిడ్డను చంపాలనుకున్నారని.. వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కట్నం వేధింపులు ఎంత దారుణానికి దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *