నేరుగా నిద్రపోవడం : ఇలా మీరు వీపు బెడ్ పై ఉంచి, కాలు చాచి , నేరుగానిద్రపోయి నట్లు అయితే, ఇలాంటి వ్యక్తులు చాలా ముందు చూపు కలవారు. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు ఏ పని చేసినా, చాలా ముందు చూపుతో చేస్తారు. వీరిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు.
ఒకే పక్కకు తిరిగి పడుకోవడం: ఇలాంటి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో చాలా త్వరగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. ముఖ్యంగా వీరి మాటలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతారు. స్నేహితులతో, బంధు మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఏ పని చేసినా చాలా నిజయతీగా చేస్తారు.
కడుపు పై పడుకోవడం : ఇలాంటి వ్యక్తి చాలా లోతైన విశ్వాస పాత్రమైన స్వాభావం ఉన్న వ్యక్తులు. వీరు బంధువులకు, స్నేహితులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కెరీర్ పరంగా మంచి క్లారిటీతో ఉంటారు. అనవసర నిర్ణయాలు తీసుకోరు. వీరి ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి పనిలో విజయం సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది.
స్టార్ ఫిష్ లా నిద్ర పోవడం : ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. చాలా శాంతి స్వభావంతో ఉంటారు. స్నేహం, బంధాలకు ఎక్కువ విలువను ఇస్తారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




