మీరు తాగే టీ అసలైనదేనా? టీ పొడిలో కల్తీని కనిపెట్టే ఈజీ ట్రిక్! వెంటనే అలర్ట్‌ అవ్వండి..

మీరు తాగే టీ అసలైనదేనా? టీ పొడిలో కల్తీని కనిపెట్టే ఈజీ ట్రిక్! వెంటనే అలర్ట్‌ అవ్వండి..


మీరు తాగే టీ అసలైనదేనా? టీ పొడిలో కల్తీని కనిపెట్టే ఈజీ ట్రిక్! వెంటనే అలర్ట్‌ అవ్వండి..

మన దేశంలో ఉదయం లేవగానే టీ తాగని వారు అరుదుగా ఉంటారు. కానీ, మార్కెట్లో దొరికే టీ పొడిలో విపరీతమైన కల్తీ జరుగుతోందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్యాక్ చేసిన టీ పొడికి ఆకర్షణీయమైన రంగు రావడానికి కొన్ని కంపెనీలు కృత్రిమ రంగులను వాడుతున్నాయి. దీనిపై ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ హిమత్సింగ్కా, అలియాస్ ‘ఫుడ్ ఫార్మర్’ ఒక అవగాహన వీడియోను విడుదల చేశారు. అతని వీడియో ప్రకారం.. టీ ఆకులను ప్రాసెస్ చేసేటప్పుడు నాణ్యత తక్కువగా ఉంటే, దానికి గాఢమైన రంగు రావడానికి సింథటిక్ కలర్స్‌ను కలుపుతుంటారు. ఇవి మన ఆరోగ్యానికి, ముఖ్యంగా లివర్, కిడ్నీలకు ఎంతో హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ (FSSAI) నిబంధనల ప్రకారం టీ పొడిలో ఎటువంటి రంగులు కలపడం నిషిద్ధం.

అసలైన టీని ఎలా గుర్తించాలి? :

రేవంత్ హిమత్సింగ్కా సూచించిన ప్రకారం, టీ పొడి కల్తీని పరీక్షించడానికి మీకు ఒక నిమిషం చాలు. ఇందుకోసం ఒక గాజు గ్లాసులో సాధారణ నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ టీ పొడిని వేయండి. ఇలా చేసినప్పుడు ఒకవేళ నీరు వెంటనే రంగు మారడం ప్రారంభిస్తే, ఆ టీ పొడిలో రంగులు కలిపారని అర్థం. ఎందుకంటే సహజమైన టీ పొడి చల్లని నీటిలో రంగును వదలదు. నిజమైన టీ పొడిని చల్లని నీటిలో వేస్తే అది అడుగుకు చేరుతుంది. కానీ, రంగు మారడానికి చాలా సమయం పడుతుంది. కేవలం వేడి నీటిలో మాత్రమే టీ ఆకులు రంగును, రుచిని విడుదల చేస్తాయి.

మరో పద్ధతిలో టీ పొడిని ఒక తెల్లటి ఫిల్టర్ పేపర్ లేదా టిష్యూ పేపర్ మీద వేసి, దానిపై కొన్ని చుక్కల నీరు చల్లండి. కాసేపటి తర్వాత టీ పొడిని తీసివేసి చూడండి. కాగితంపై గాఢమైన రంగు మచ్చలు కనిపిస్తే అది కల్తీ టీ అని అర్థం.

 

View this post on Instagram

 

A post shared by Revant Himatsingka (@foodpharmer)

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై అవగాహన ఉండటం ముఖ్యం. ‘ఫుడ్ ఫార్మర్’ చెప్పిన ఈ చిన్న చిట్కాను పాటించి, మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛతను పరీక్షించుకోండి. కల్తీ లేని ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *