మీరు తలుపు వైపు కాళ్లు చేసి నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

మీరు తలుపు వైపు కాళ్లు చేసి నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..


మీరు తలుపు వైపు కాళ్లు చేసి నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

వాస్తు శాస్త్రం ప్రకారం కాళ్ళు తలుపు వైపు పెట్టి నిద్రపోవడం చాలా అశుభం. ఒక వ్యక్తి కాళ్ళు తలుపు వైపు పెట్టి నిద్రపోతే, ప్రతికూల శక్తి నేరుగా ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ కారణంగా దానిని అశుభం అని భావిస్తారు. పలు గ్రంథాల ప్రకారం మృతదేహాన్ని మాత్రమే కాళ్ళు తలుపు దగ్గర ఉంచుతారు. కాబట్టి ఈ విధంగా నిద్రించడం అశుభమని భావిస్తారు. తలుపు ఇంటికి ప్రవేశ ద్వారం అని, అక్కడ పాదాలను ఉంచడం దేవుడిని లేదా ఇంటి దేవత లక్ష్మీని అవమానించినట్లు వాస్తు నిపుణులు అంటున్నారు.

మత విశ్వాసాల ప్రకారం.. దేవతలు, పూర్వీకుల శక్తి తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల మీ పాదాలను తలుపు వైపు ఉంచి నిద్రించడం వల్ల సానుకూల శక్తి అడ్డుకుంటుంది. నిద్రపోయేటప్పుడు మీ పాదాలను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశగా ఉంచి నిద్రించడం శుభప్రదం. ఇది మన జీవితాల్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పటి వరకు అలా నిద్రపోతుంటే.. ఇక నుంచి అలా చేయకండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *