మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌

మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌


మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌

ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఒక సాధారణ విద్యార్థి పడే ఆరాటం అంతా ‘మంచి మార్కులు, పెద్ద డిగ్రీ కోసమే. కానీ, ఆ పట్టా చేతికి వచ్చాక వారికి అసలు సవాళ్లు మొదలవుతున్నాయి. నేడు అనేక పట్టణాల్లో నిరుద్యోగ యువత ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఓ యువతి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో.. “నా దగ్గర గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. పేరున్న యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉన్నాయి. కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చిన్న కోడింగ్ రాయమన్నా, మార్కెటింగ్ స్కిల్ చూపించమన్నా తడబడుతున్నాను” అని సదరు యువతి చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది నిరుద్యోగుల గొంతుకగా మారాయి. కేవలం పరీక్షల కోసం చదవడం వల్ల కలిగే అనర్థాలను ఆమె కళ్లకు కట్టారు. చాలా మంది విద్యార్థులు కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా చదువుతున్నారు. పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టీ పట్టి, పరీక్షా పత్రంపై దింపి, మంచి పర్సంటేజీ సాధిస్తున్నారు. కానీ, ఆ చదువుకు ప్రాక్టికల్ అప్లికేషన్ తో సంబంధం ఉండటం లేదు. దీన్నే నిపుణులు ‘ఎగ్జామ్ ట్రాప్’ అని పిలుస్తున్నారు. ఈ ట్రాప్‌లో పడటం వల్ల యువత కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యంలో వెనుకబడి, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఫలితంగా డిగ్రీలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. యువత కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐటీ రంగం నుంచి అగ్రికల్చర్ వరకు ప్రతీ చోటా ఇప్పుడు ‘సర్టిఫికేట్’ కంటే ‘ఏమి చేయగలవు?’ అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఇస్తున్నారు. “ఆదాయం పెరగాలంటే ముందు మన విలువ పెరగాలి” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, డిగ్రీని కేవలం ఒక అర్హతగా మాత్రమే చూసి, వృత్తిపరమైన నైపుణ్యాలను సాధించడమే నిరుద్యోగ సమస్యకు అసలైన పరిష్కారమని యువతి వీడియో సందేశం ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NBK 111: రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టిన NBK 111 టీమ్‌

Devi Sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్‌, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గొడవేంటి

Vrushakarma: ఫస్ట్‌ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన చైతూ, సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తారా

సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి

OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *