మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..


మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

సోషల్ మీడియా ముసుగులో మహిళలను వేధిస్తూ, అమాయకులను మోసం చేస్తున్న ఒక కేటుగాడికి ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు సినిమా స్టైల్‌లో బుద్ధి చెప్పారు. యూట్యూబ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న పాలేబోయిన బాలాంజనేయులు అనే వ్యక్తి అసలు రంగు బయటపడటంతో, బాధితులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాలాంజనేయులు గత కొంతకాలంగా మహిళల ఫోటోలను దొంగచాటుగా తీయడమే కాకుండా, దొంగ సిమ్ కార్డులతో ఫేక్ ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాలను సృష్టించాడు. ఆ ఖాతాల్లో మహిళల ఫోటోలు పెట్టి పురుషులకు వలవేసి డబ్బులు గుంజేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే తన యూట్యూబ్ ఛానెల్ పవర్ చూపిస్తానని, పోలీసులకు చెబుతానని బెదిరింపులకు దిగేవాడు. ఇతని ఆగడాలు మితిమీరడంతో ఏల్చూరు గ్రామస్తులు నిందితుడిని నిలదీశారు. తప్పించుకునే దారి లేక బాలాంజనేయులు మహిళల కాళ్లపై పడి “ఇక తప్పు చేయను” అని ప్రాధేయపడ్డాడు. అయినా శాంతించని మహిళలు అతడిని చెప్పులతో చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ అకౌంట్ల మాయలో పడి మోసపోవద్దని ఎస్ఐ నాగరాజు ప్రజలకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..

ఇష్టమైన తీరానికే మళ్లీ మళ్లీ వచ్చే తాబేళ్లు.. ఇదెలా సాధ్యం ?

మార్కుల వేటలో పడి స్కిల్స్‌ మరిచా.. యువతి వీడియో వైరల్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *