ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.. దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఈ మేరకు టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి..