రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం జరిమానాలు విధించడం కాకుండా, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన ఉద్దేశంగా హెల్మెట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ అవినాష్ మహంతి సూచనల మేరకు వాయుపురిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను ఆపి, పోలీసులు సహనంతో వారికి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ బ్యాంక్ ద్వారా వారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.
మరిన్ని వీడియోల కోసం :