మఖానా తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మఖానాలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగ గింజలన కంటే మఖానా ఆరోగ్యానికి ఎన్నో రెట్లు ఎక్కువ మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
మఖానా తినడం వల్ల కడుపు వెంటనే నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అధికంగా తినాలనే దోరణి తగ్గుతుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో వీటిని తీసుకోవడం మంచిది.
అంతేకాకుండా మఖానాలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుని త్వరగా నింపుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే, చాలా మంది మఖానాకు బదులుగా వేరుశెనగలను తింటారు.
మఖానా ప్రయోజనకరమైనదా లేదా వేరుశనగనా అనే ప్రశ్న తలెత్తితే.. వేరుశనగ కంటే మఖానా ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమైనదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు అందుకు కారణం.
వేరుశెనగలు బరువు పెరగడానికి కారణమవుతాయి. మఖానా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే ముందుగా మఖానాను వేయించి, ఆ తర్వాత మాత్రమే తినాలి. మఖానా ఆరోగ్యకరమైనది, జీర్ణం కావడం కూడా చాలా సులభం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మఖానా ప్రయోజనకరంగా ఉంటుంది.