ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ ఓ ప్రత్యేక బహుమతిని అందించనున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడినప్పుడు తాను ధరించిన క్యాప్‌ను మంత్రి లోకేష్‌కు ఇవ్వనున్నట్లు తిలక్ వర్మ స్వయంగా తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్, తిలక్ వర్మ ఇచ్చిన బహుమతిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “తమ్ముడు తిలక్ వర్మ బహుమతి తనకెంతో ప్రత్యేకమైనది” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తిలక్ వర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతని చేతుల మీదుగానే ఆ క్యాప్‌ను స్వీకరిస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్‌కు “అరట్టై’ పోటీ కానుందా.. ట్రెండింగ్ లోకి వచ్చిన యాప్
బాలీవుడ్ లో శ్రీలీల, సాయి పల్లవి తొలి అడుగులు
ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్
పక్కా ప్లానింగ్‌తో నేచురల్ స్టార్ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే
స్టార్ హీరోయిన్స్ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా