రీసెంట్ డేస్ లో చాలా మంది ముద్దుగుమ్మలు గ్లామర్ డోస్ పెంచుతున్నారు. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ చేయడానికైనా రెడీ అవుతున్నారు. మొన్నటివరకూ పద్దతిగా కనిపించిన ఈ హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నారు. రీసెంట్ గా ఓ అందాల భామ కూడా గ్లామర్ రోల్ లో నటించి షాక్ ఇచ్చింది. అప్పటివరకు పద్ధతిగా కనిపించిన ఆమె సడన్ గా గ్లామర్ రోల్ లో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. తాజాగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా సీరియస్ అయ్యింది ఆ ముద్దుగుమ్మ. మంచి సినిమా తీస్తే మీరే చూడరు. అదే గ్లామర్ రోల్ చేస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం అని అంటారు అంటూ సీరియస్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కూడా దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్నపాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.
ఇవి కూడా చదవండి
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
మీడియా రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. ఇటీవలే కిష్కిందాపురి సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. తాజాగా అనుపమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుపమ ఓ జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యింది. డీజే టిల్లు సినిమాలో గ్లామరస్ గా కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పడంతో అనుపమ సీరియస్ అయ్యింది. అనుపమ మాట్లాడుతూ.. మొన్న నేను పరదా అనే సినిమా చేశాను మీరు చూశారా వెళ్లి.. ? అది చూస్తే మీరు హ్యాపీ అయ్యేవారు. మీరు చూడలేదు అందుకే మూవీ వర్క్ అవ్వలేదు. ఇది ఎవ్వరూ మాట్లాడారు. మంచి సినిమా చేస్తే చూడరు కానీ టిల్లు స్క్వేర్ లో డైజెస్ట్ చేసుకోలేకపోయా అంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.