తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాస్ వేలను నిశితంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై భారీగా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని, వేలాడే విద్యుత్ వైర్లను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కురుస్తున్న నాన్‌స్టాప్ భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో, ప్రాణాపాయం జరగకుండా యంత్రాంగమంతా హై అలర్ట్‌గా ఉండి చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం
నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్ పే బంపర్ ఆఫర్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!
రెహమాన్ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే