అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ కంపెనీలపై, ముఖ్యంగా ఫార్మా రంగంపై తన కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇతర రంగాలపై విధించిన సుంకాలు భారత్‌ను భయపెడుతుండగా, ఇప్పుడు ఫార్మా రంగంపై వంద శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటన చేశారు. ఈ కొత్త సుంకాలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, భారతీయ ఫార్మా దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంచనా. ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులపై ఎటువంటి సుంకాలు ఉండవు. ఫార్మా కంపెనీ నిర్మాణం జరుగుతున్నా, పునాది వేసినా సుంకాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా అమెరికాలో తయారీని ప్రోత్సహించాలనేది ట్రంప్ ఉద్దేశ్యం. ప్రస్తుతం భారత్ నుండి అమెరికాకు సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో