తాజాగా మరోసారి ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భర్త ముఖేష్ అంబానీతో కలిసి హాజరైన ఆమె తన స్టైలిష్ లుక్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గ్రీన్ కలర్ శారీలో, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన నెక్లెస్‌తో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈవెంట్‌కు హాజరైన వారంతా ఈమె శారీగురించే చర్చించుకున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఈ సిరీస్ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ముంబైలో చిత్ర యూనిట్ ఓ ప్రీమియర్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ తన కుటుంబంతో సహా విచ్చేశారు. భర్త ముఖేశ్‌తో కలిసి నీతా అంబానీ ఫొటోలకు ఫోజులిచ్చారు. వారి పిల్లలు, కోడళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో నీతా డ్రెస్ సెన్స్ చూసిన.. నెటిజన్లు.. ఏ కార్యక్రమానికి ఎలా హాజరు కావాలో నీతా అంబానీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్
కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది
TOP 9 ET News: NTRకి ప్రమాదం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు
Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు